కార్తీక మాసం తొలి రోజు కీసరగుట్టలో భక్తుల రద్దీ
కీసర, అక్టోబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
కార్తీక మాసం ప్రారంభమైన తొలి రోజునే మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన ఈ పవిత్ర మాసంలో తెల్లవారు జామున నుంచే కుటుంబ సమేతంగా భక్తులు స్వామి దర్శనార్థం తరలివచ్చారు.
ఆలయ ప్రాంగణం భక్తి భావంతో కళకళలాడగా, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ఆకాశ దీపం దర్శించేందుకు భక్తులు ఉత్సాహం చూపుతున్నారు.భక్తుల సౌకర్యార్థం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి తెలిపారు. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సౌకర్యాలు సమకూర్చినట్లు చెప్పారు.గత ఏడాదితో పోలిస్తే ఈసారి కార్తీక మాసంలో భక్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు పేర్కొన్నారు.


Comments