కాంగ్రెస్ నేత తోటకూర వజ్రెష్ యాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు
నాగారం, అక్టోబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి ,మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఆదివారం పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు తోటకూర వజ్రెష్ యాదవ్ పూల బొక్క అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు కేక్ కట్ చేశారు. పార్టీ బలోపేతం దిశగా ఆయన చేస్తున్న కృషిని నాయకులు ప్రశంసించారు. మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చైతన్యం తీసుకువచ్చిన నాయకుడిగా వజ్రెష్ యాదవ్ గుర్తింపు పొందారని వారు తెలిపారు. యువతను రాజకీయాల్లోకి ప్రోత్సహిస్తూ పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్న ఆయనకు మరింత శక్తి, ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు మాదిరెడ్డి వెంకటరెడ్డి, పంగ హరిబాబు, సుర్వి శ్రీనివాస్ గౌడ్, అన్నం రాజు, సుమిత్ర సురేష్, సీనియర్ నాయకులు మామిళ్ల కృష్ణ యాదవ్, మాదిరెడ్డి రాజిరెడ్డి, మామిడాల సతీష్ తదితరులు పాల్గొన్నారు.


Comments