సత్తుపల్లి రాజీవ్ నగర్‌లో మైనర్ బాలుడు అదృశ్యం
.సత్తుపల్లి, అక్టోబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ 11వ రోడ్‌లో నివాసముండే 15 ఏళ్ల గువ్వల రమణ, 8వ తరగతి విద్యార్థి, గత నాలుగు రోజులుగా కనిపించడంలేదు. చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయిన రమణ, తన అమ్మమ్మ గువ్వల సావిత్రి సంరక్షణలో పెరిగాడు.
పండుగ సందర్భంగా రాజీవ్ నగరంలో బతుకమ్మ వేడుకలలో డీజే ఏర్పాటు చేశారు. వేడుక ముగిసిన తర్వాత, డీజేకు సంబంధించిన వ్యక్తులు రమణ ఇంటికి వచ్చి, డీజే బాక్స్‌ల కోసం 9,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
అవసరం అయిన సంతకాలను పెట్టకపోతే రమణను హిజ్రాల వద్దకు తీసుకెళ్ళి ఇంజక్షన్ ద్వారా పనికిరాని వ్యక్తిగా చేస్తామని బెదిరించారు.
బెదిరింపుని భయపడి రమణ నాలుగు రోజులుగా ఇంటికి రాలేదని, గువ్వల సావిత్రి సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, బాలుడిని వెతికే చర్యలు ప్రారంభించారు.


Comments