కుల అహంకార హత్యలు ఇంకెన్నాళ్లు 

తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్

కుల అహంకార హత్యలు ఇంకెన్నాళ్లు 

నిండు గర్భిణి అని చూడకుండా నరికి చంపిన మామ.

భీమదేవరపల్లి తెలంగాణ ముచ్చట్లు 

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంకొడుకు కులాంతర వివాహం చేసుకోవడం తప్పా  భారతదేశ వ్యాప్తంగా కులాంతర హత్యలు, దాడులు ,దౌర్జన్యాలు మర్డర్లు, కుల బహిష్కరణలు భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో ఏదో ఒక ప్రాంతంలో రోజు కొన్ని వందల సంఖ్యలో జరుగుతున్నాయి స్వాతంత్రం వచ్చి 78సంవత్సరాలు గడిచిన ఆనాటి నుండి నేటి వరకు కులాంతర, కులహంకార దాడులు మర్డర్లు జరుగుతూనే ఉన్నాయి. నిన్నటి రోజు తెలంగాణ లో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం గొర్రె గ్రామంలో వివాహిత రాణి 23 సంవత్సరాలు రాణి ని శేఖర్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది ,వారి తండ్రి కుటుంబ సభ్యులు ఆమెను విడిచిపెట్టి నువ్వు రావాలని పలుమార్లు చెప్పడం రాణి ని కూడా చంపేస్తామని బెదిరించడం జరిగింది .నిండు గర్భిణి అయిన కోడల్ని నరికి చంపిన మామ శేఖర్ తన అత్తమామలు చెన్నయ్య అనూష బావమరిది కలిసి వంట చెరుకు తెచ్చేందుకు సమీప అటవీ ప్రాంతానికి వెళ్ళాడు శ్రావణి ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై కక్షగట్టి అనువైన సమయం కోసం ఎదురుచూస్తున్న మామ కు ఇది చక్కటి అవకాశం అని ఒంటరిగా ఉన్న ఆమెపై గొడ్డలితో దాడి చేశారు ఆమె ప్రాణభయంతో అరుస్తూ బయటకు పరుగులు తీసింది అయినా వెంబడించి మరి  మెడపై నరికాడు స్థానికులు అక్కడికి చేరుకునేలోగా అక్కడి నుంచి పారిపోయాడు శ్రావణి అక్కడికక్కడే మృతి చెందింది. ఇంకెన్నాళ్లు ఏ కుల దుహంకార హత్యలు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!