పోలిశెట్టి బాబురావుకు ఘన నివాళులు

పోలిశెట్టి బాబురావుకు ఘన నివాళులు

ఏఎస్‌ రావునగర్‌, అక్టోబర్‌ 30 (తెలంగాణ ముచ్చట్లు) :

ఏఎస్‌ రావునగర్‌కు చెందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారవేత్త, క్రాంతి బిల్డర్స్‌ ప్రోప్రైటర్‌ స్వర్గీయ పోలిశెట్టి బాబురావు దశదినకర్మ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బాబురావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భాను ప్రసాద్‌, బీఆర్ఎస్‌ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్‌ రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ పజ్జూరి పావని రెడ్డి, నాయకులు బండారి నీలం రెడ్డి, దామోదర్‌ రావు, పోలిశెట్టి శ్రీనివాస్‌, పోలిశెట్టి రవి, పోలిశెట్టి కళ్యాణ్‌, మధు తదితరులు పాల్గొన్నారు.పోలిశెట్టి బాబురావు నిర్మాణరంగంలో చిరస్మరణీయ సేవలందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించారని పలువురు ప్రసంగించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .