రక్తదానంతో సేవాస్ఫూర్తి చాటిన 15వ బెటాలియన్ సిబ్బంది.
పోలీసు జెండా దినోత్సవాల్లో భాగంగా కార్యక్రమం.
Views: 3
On
సత్తుపల్లి, అక్టోబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
బి.గంగారం గ్రామం, పోలీసు జెండా దినోత్సవాల సందర్భంగా 15వ ప్రత్యేక పోలీసు బెటాలియన్ ఆధ్వర్యంలో బుధవారం బెటాలియన్ కార్యాలయంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. బెటాలియన్ సిబ్బంది, అధికారులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ ఎన్. పెద్దబాబు మాట్లాడుతూ, అన్నీ దానాలలోకంటే రక్తదానం అత్యుత్తమమని, రక్తదానం చేయడం ద్వారా అనేకమంది ప్రాణాలు కాపాడబడతాయని అన్నారు.
రక్తదానం చేయడం ఆరోగ్యానికి మేలని, సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇది గొప్ప సహాయం అవుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో అదనపు కమాండెంట్ ఏ. అంజయ్య, బెటాలియన్ వైద్యాధికారి అవినాష్, పిఎస్సీ గంగారం వైద్యులు ఆకాష్, సిబ్బంది, కానిస్టేబుల్ అధికారి బృందం పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
02 Nov 2025 21:47:09
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు):
రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు.
పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...


Comments