వల్లభాపురంలో మొంథా తుఫాన్ భీభత్సం
కూలిన ఇండ్లు,నిరాశ్రయులైన పలు కుటుంబాలు
ఎల్కతుర్తి,అక్టోబర్30(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని వల్లభాపురం గ్రామంలో బుధవారం కురిసిన భారీ వర్షాలు గ్రామంలో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించడంతో మట్టి బీటలు వేసి రెండు ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి..jpeg)
పోతిరెడ్డి ప్రభాకర్ తండ్రి కొమురయ్య, పడిదల స్వామిరావు తండ్రి రాజేశ్వరరావు గృహాలు ధ్వంసమయ్యాయి. ఇళ్లలో ఉన్న నిత్యావసర వస్తువులు, గృహోపకరణాలు మొత్తం నీటిలో మునిగి నాశనమయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే ఆళ్ళ రాంబాబు తండ్రి ఓదెలు ఇంటి బాత్రూమ్‌లు కూలిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వర్షాల బీభత్సంతో నిరాశ్రయులైన బాధితులు ప్రభుత్వం వెంటనే పునర్నిర్మాణ సహాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.


Comments