దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీకి తరలిరావాలి.
గవాయ్ పై దాడిని రాజ్యాంగంపై జరిగిన దాడిగానే చూస్తం.
-తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల నాగేందర్ మాదిగ.
హైదరాబాద్,అక్టోబర్30(తెలంగాణ ముచ్చట్లు):
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పై ఇటీవల జరిగిన దాడిని రాజ్యాంగం పై జరిగిన దాడిగానే చూస్తామని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ అన్నారు. గురువారం హైదరాబాదులోని ఆ సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తి పై దాడి జరిపిన వ్యక్తిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వ్యక్తిపై నేటికీ కేసు నమోదు చేయకపోవడం దళితులను అవమానించడమేనని మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో దళితులు ఆత్మగౌరవ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు. నవంబర్ 1న హైదరాబాదులో మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జరిగే దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీకి దళితులు, జర్నలిస్టులు, ప్రజాస్వామికవాదులు అధిక సంఖ్యలో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట రాష్ట్ర ఉపాధ్యక్షులు బొల్లెపాక రాజేష్, రాష్ట్ర కార్యదర్శి సుక్క అశోక్, రాష్ట్ర నాయకులు బొట్ల సదానందం ఉన్నారు.


Comments