మహిళలకు ఉపాధి
డాక్టర్ కాపా మురళీకృష్ణ
ఖమ్మం బ్యూరో,నవంబర్ 2, తెలంగాణ ముచ్చట్లు;
మహిళలు ఆర్థికంగా తోడ్పాటు ను ఇచ్చే విధంగా కుట్టు మిషన్లు ఉపయోగపడతాయని ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ కాప మురళీకృష్ణ అన్నారు. వైరా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక లయన్స్ కంటి ఆసుపత్రి నందు వైరాకు చెందిన ఇద్దరు నిరుపేద మహిళలకు కుట్టు మిషన్ లు అందజేసే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ద్వారా ఎంతో మంది మహిళలకు వారి ఉపాధికు ఉపయోగపడే విధంగా పలు రకాలుగా సహాయ సహకారాలు అందించడం జరిగిందని భవిష్యత్తులో నిజమైన' నిరుపేదలకు ఇదేవిధంగా సహకారం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని' ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ కోఆర్డినేటర్ లగడపాటి ప్రభాకర్, కోఆర్డినేటర్ యు. శ్యాంబాబు రీజన్ సెక్రెటరీ పెనుగొండ ఉపేంద్రరావు జోన్ చైర్మన్ చింతోజు నాగేశ్వరరావు కార్యదర్శి చెరుకూరి శ్రీనివాసరావు కోశాధికారి గద్దె నీరజ తదితరులు పాల్గొని వైరాకు చెందిన పఠాన్ గౌస్ బేగం షేక్ చెన్న పుల్లాభి లకు కుట్టుమిషన్లు అందజేశారు


Comments