హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
Views: 10
On
హైదరాబాద్, నవంబర్ 2 (తెలంగాణ ముచ్చట్లు)
మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావును తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర నాయకుడు రేగళ్ల సతీష్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. హరీష్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ ఇటీవల మృతిచెందిన నేపథ్యంలో, సతీష్ రెడ్డి పాటు కొప్పుల కుమార్, గిల్బర్ట్, సురేష్ నాయక్, ప్రవీణ్ తదితరులు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు.హరీష్‌రావు తండ్రి దివంగత సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఇలాంటి విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించినట్లు రేగళ్ల సతీష్ రెడ్డి పేర్కొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
02 Nov 2025 21:47:09
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు):
రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు.
పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...


Comments