సత్తుపల్లి గోలి హిమవర్షిణి డీఎస్పీగా ఎంపిక.!
సృజన సాహితీ సమాఖ్య అభినందనలు.
Views: 255
On
సత్తుపల్లి, అక్టోబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి పట్టణానికి చెందిన గోలి శ్రీనివాసరెడ్డి–ఉషారాణి దంపతుల కుమార్తె గోలి హిమవర్షిణి గ్రూప్–1 పరీక్షల్లో డీఎస్పీగా ఎంపికైన సందర్భంగా సృజన సాహితీ సమాఖ్య మంగళవారం ఆమెకు ఘనాభినందనలు తెలిపింది.
శిక్షణ నిమిత్తం హైదరాబాద్ వెళ్తున్న హిమవర్షిణిని సృజన నిర్వాహకులు శాలువా, పుష్పగుచ్ఛాలతో సన్మానించి సృజన ప్రచురణ సాహిత్య గ్రంథాలను అందజేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, పట్టుదల, కృషితో సాధించిన ఈ విజయాన్ని ప్రజాసేవకు వినియోగించాలని హిమవర్షిణి ప్రయత్నించాలి అని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గోలి శ్రీనివాసరెడ్డి, ఉషారాణి దంపతులు, సృజన నిర్వాహకులు రామకృష్ణ, మధుసూదన రాజు, పసుపులేటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
02 Nov 2025 21:47:09
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు):
రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు.
పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...


Comments