తెలంగాణ ముచ్చట్లు కథనానికి అధికారుల స్పందన

చెరువు అంచున రక్షణ పిల్డర్ల ఏర్పాటు, పనులు పూర్తి

తెలంగాణ ముచ్చట్లు కథనానికి అధికారుల స్పందన

ఎల్కతుర్తి,అక్టోబర్‌ 20(తెలంగాణ ముచ్చట్లు):

ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ చెరువు పై ఉన్న రహదారి ప్రమాదకరంగా మారిందని తెలంగాణ ముచ్చట్లు దినపత్రికలో గత వారం ప్రచురితమైన కథనానికి అధికారులు వెంటనే స్పందించారు.
చెరువు అంచున ఉన్న రహదారి వద్ద రక్షణ పిల్డర్లు కూలిపోవడంతో వాహనదారులు భయంతో ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను పత్రిక వెలుగులోకి తీసుకురాగానే అధికారులు వెంటనే చర్యలు ప్రారంభించారు.

మరమ్మత్తు పనులు వేగంగా పూర్తి చేసి, కొత్త రక్షణ పిల్డర్లను బలంగా ఏర్పాటు చేశారు.స్థానికులు మాట్లాడుతూ....“చెరువు నిండిన సమయంలో బస్సులు, ఆటోలు, పాఠశాల వాహనాలు ఈ మార్గంలో ప్రయాణించడం ప్రమాదకరంగా ఉండేది. అధికారులు వెంటనే స్పందించి పిల్డర్లు నిర్మించడం మాకు చాలా ఉపశమనం కలిగించింది” అని తెలిపారు.అదేవిధంగా తమ సమస్యను ప్రజా దృష్టికి తీసుకువచ్చిన తెలంగాణ ముచ్చట్లు పత్రికకు గోపాల్పూర్ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!