డి.ఎ.వి రాష్ట్ర స్థాయి క్రీడల్లో మెరిసిన సాయిస్ఫూర్తి డి.ఎ.వి విద్యార్థులు.
సత్తుపల్లి, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
హైదరాబాద్ సఫిల్‌గూడలోని డి.ఎ.వి స్కూల్ ప్రాంగణంలో 10, 11 తేదీల్లో నిర్వహించిన డి.ఎ.వి స్టేట్ లెవల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 20 పాఠశాలల నుండి సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ పోటీలలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బి.గంగారం గ్రామంలోని సాయిస్ఫూర్తి డి.ఎ.వి స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబరిచారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తణుకు శేష సాయిశ్రీ మాట్లాడుతూ, ఈ ఏడాది మా విద్యార్థులు రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్, గేమ్స్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించి పాఠశాలకు గౌరవం తీసుకువచ్చారు అన్నారు.
విజేతలు ఇలా ఉన్నారు:
- 14 సంవత్సరాల విభాగంలో: చెస్ టీమ్ ప్రథమ స్థానం.
- 19 సంవత్సరాల బాలుర విభాగంలో: వాలీబాల్ టీమ్ ప్రథమ స్థానం, డిస్కస్ త్రోలో జి.కె.జి. గౌతమ్ ప్రథమ స్థానం.
- 17 సంవత్సరాల విభాగంలో: 100 మీటర్ల పరుగులో డి.సాయి విఘ్నేష్ ద్వితీయ బహుమతి, 200 మీటర్లలో ఎస్.లోకేష్ తృతీయ బహుమతి, 400 మీటర్లలో ఎల్.లిఖిల్ ద్వితీయ బహుమతి, 800 మీటర్లలో కె.ఆశ్రిత తృతీయ బహుమతి.
- షాట్‌పుట్, డిస్కస్ త్రో విభాగాల్లో వై.గౌరీప్రియ ప్రథమ బహుమతులు.
- 14 సంవత్సరాల బాలికల విభాగంలో: 100 మీటర్లలో ఎల్.మాన్విత ప్రథమ బహుమతి, 400 మీటర్లలో కె.అక్షర ద్వితీయ బహుమతి, 800 మీటర్లలో టి.నైనిష ప్రథమ బహుమతి, షాట్‌పుట్‌లో సిహెచ్.ఉపేక్ష ప్రథమ బహుమతి సాధించారు.
- అండర్–19 రన్నింగ్ విభాగంలో: ఎ.రోహిత, ఎన్.కృష్ణధీరజ్, ఎస్.దీక్షిత్ మెరిసారు.
- లాంగ్‌జంప్ విభాగంలో: ఎ.రోహిత ప్రథమ బహుమతి.
- అండర్–17 కరాటే విభాగంలో: జి.కీర్తిశ్రీ, జి.శంకర్, బి.అభిరామ్ విజయాలు సాధించారు.
- కబడ్డీ, వాలీబాల్ టీంలు కూడా అగ్రస్థానాలు పొందాయి.
ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులు నవంబర్‌లో ఢిల్లీలో జరగబోయే డి.ఎ.వి నేషనల్ గేమ్స్‌కి ఎంపికయ్యారు.
పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, మా విద్యార్థులు ప్రతి ఏడాది చదువుతోపాటు క్రీడల్లోనూ అగ్రగాములు కావడం ఆనందకరం. క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు పాఠశాల ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది” అన్నారు.
విజేతలకు శిక్షణ అందించిన పి.డి. కె.కుమారస్వామి, పి.ఇ.టి. ఎం.రామ్‌శెట్టి, పి.ఇ.టి. కె.వాసుదేవరావులను సాయిస్ఫూర్తి హానరరీ చైర్మన్ డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, డి.ఎ.వి తెలంగాణ జోన్-ఏ రీజనల్ ఆఫీసర్ జి.ఆర్.కె.ప్రసాద్, సాయిస్ఫూర్తి కాలేజ్ చైర్మన్ దాసరి ప్రభాకర్‌రెడ్డి,విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్టీ బండి అన్విద, సాయిస్ఫూర్తి కళాశాల ప్రిన్సిపాల్ శేష రత్నకుమారి అభినందించారు 


Comments