రక్త దానం కంటే గొప్పది ఈ లోకంలో ఏది లేదు.
రక్తదాతగా వీరబోయిన తిరుపతి యాదవ్.
హాసన్ పర్తి, అక్టోబర్ 23(తెలంగాణ ముచ్చట్లు):
ప్రతి ఒక్కరూ సమాజంలో ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే దానికి ముఖ్య కారణం పోలీస్ అని ప్రజల కోసం నిస్వార్ధంగా పనిచేసి అమరులైన పోలీసులకు వారి కుటుంబాలకు సామాజిక వందనాలు తెలుపుతూ వారి త్యాగం చాలా గొప్పదని సామాజిక ఉద్యమకారుడు వీరబోయిన తిరుపతి కొనియాడారు.పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్థం సందర్భంగా వరంగల్ కమిషన్ రేట్ ఆధ్వర్యంలో మడికొండలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో వరంగల్ మున్సిపాలిటీ 65 వ డివిజన్ ఎల్లాపూర్ గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు వీరబోయిన తిరుపతి రక్తదానం చేసి మాట్లాడుతూ నేడు ప్రతి ఒక్కరూ సమాజంలో ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే దానికి ముఖ్య కారణం పోలీస్ అని ప్రజల కోసం నిస్వార్ధంగా పనిచేసి అమరులైన పోలీసులకు వారి కుటుంబాలకు సామాజిక వందనాలు తెలుపుతూ వారి త్యాగం చాలా గొప్పదని కొనియాడారు.ఎల్లాపూర్ గ్రామ వీపీఓ జన్ను మధు సూచన మేరకు అమరవీరుల జ్ఞాపకార్థం రక్తదాన శిబిరంలో రక్త దాతగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ప్రాణం ఇవ్వకుండా ఇంకో ప్రాణాన్ని కాపాడే గొప్ప విషయం రక్త దానం లోనే ఉందని కొందరి కన్నీటిని చిరునవ్వుగా మార్చే శక్తి రక్తదానంలో ఉందని ప్రాణం రక్షించడం కంటే గొప్ప పుణ్యం రక్త దానం కంటే గొప్పది ఈ లోకంలో ఏది లేదని,రక్తదానం ఒకరికి ఆశ, మరొకరికి కొత్త ఉదయం లాంటిదని రక్తదానం చేయడం కేవలం సేవ కాదు అది మానవత్వం యొక్క పండుగ అని ఒక మనిషి రక్తదానం చేస్తే ముగ్గురి జీవితానికి వెలుగు లాంటిదని రక్తం వృధా కాదు ప్రతి రక్తపు బొట్టు కొందరికి శ్వాస అని రక్తదానం యొక్క గొప్పతనాన్ని తెలిపారు.
ఈ సందర్భంగా వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పింగళి ప్రశాంత్ రెడ్డి, హసన్ పర్తి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చేరాలు ఇలానే సామాజిక కార్యక్రమాల్లో ముందుకు సాగాలని కోరుతూ అభినందించారు.


Comments