ఓయూలో  మంత్రి వాకిటి శ్రీహరి జన్మదిన వేడుకలు

ఓయూలో  మంత్రి వాకిటి శ్రీహరి జన్మదిన వేడుకలు

నాచారం, నవంబర్ 01 (తెలంగాణ ముచ్చట్లు):

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఓయూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఓయూ బీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ, "బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వాకిటి శ్రీహరి. బీసీ వర్గాల కోసం 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి ఆయనకు భగవంతుడు మరింత శక్తి, సామర్థ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. రెండు కోట్లకుపైగా బీసీ ప్రజల ఆశీర్వాదం, అండ ఆయనతో ఉంది" అని పేర్కొన్నారు. బలహీన వర్గాల తరపున బలమైన స్వరంగా నిలుస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నామని తెలిపారు.కార్యక్రమంలో రెడ్డి శ్రీనివాస్ ముదిరాజ్, బొల్లేపల్లి స్వామి గౌడ్, అల్లుడు జగన్ ముదిరాజ్, బైరు నాగరాజు గౌడ్, భీమ్ రావు, కొమ్మానబోయిన సైదులు, కాంపాటి వెంకట్ గౌడ్, శ్రీకాంత్, తిమ్మానగరం వెంకట్, రఘు, చేర్యాల వంశీ, కౌశిక్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!