ద్వారకాపురి కాలనీ అభివృద్ధికి కృషి ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి

ద్వారకాపురి కాలనీ అభివృద్ధికి కృషి ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి

చర్లపల్లి, అక్టోబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):

చర్లపల్లి డివిజన్‌లోని ద్వారకాపురి కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు.ఇటీవల నూతనంగా ఎన్నికైన ద్వారకాపురి కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు కాలనీ ప్రెసిడెంట్ నాగ శివశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రతినిధులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.తరువాత కాలనీలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. రోడ్ల నిర్మాణం, వీధి దీపాలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, “ద్వారకాపురి కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ఇప్పటికే నిధులు మంజూరయ్యాయి, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. కాలనీ అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో చర్లపల్లి కాలనీల సమాఖ్య (సిసిఎస్) అధ్యక్షురాలు ఏంపల్లి పద్మా రెడ్డి, ద్వారకాపురి కాలనీ అధ్యక్షుడు నాగ శివశంకర్ రెడ్డి, గౌరవాధ్యక్షులు ఎస్.వి. నాయుడు, వైస్ ప్రెసిడెంట్ చంద్రకళ, జనరల్ సెక్రటరీ సాయిరాం రెడ్డి, జాయింట్ సెక్రటరీ శ్రీధర్ గుప్తా, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రవణ్, ట్రెజరర్ నవిత, సలహాదారులు యాదగిరి చార్యులు, శ్రీరాములు, సోమనాథ్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు శ్రీధర్ రెడ్డి, గోపాల్, సుబ్బయ్య, సూర్య రావు, సురేందర్ రావు, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!