సత్తుపల్లి డిపోలో ఆర్టీసీ వినూత్న కార్యక్రమం ప్రారంభం.
ప్రయాణికులకు ఆత్మీయ స్వాగతం, సేవలో కొత్తదనం.
సత్తుపల్లి, అక్టోబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రయాణికులను ఆత్మీయంగా పలకరించి, సేవలో స్నేహభావాన్ని పెంపొందించేందుకు తెలంగాణ ఆర్టీసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ప్రయాణికులకు ఆత్మీయ స్వాగతం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం గురువారం సత్తుపల్లి డిపోలో డిపో మేనేజర్ ఊటుకూరి సునీత ఆధ్వర్యంలో ప్రారంభమైంది.
బస్సు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుందో, ప్రయాణానికి పట్టే సమయం, మధ్యలో ఆగే స్టాప్‌లు వంటి వివరాలను డ్రైవర్, కండక్టర్‌లు ప్రయాణికులకు వివరించారు. ఆర్టీసీ సేవలను ఆదరించడంతో పాటు సురక్షితమైన, సుఖవంతమైన ప్రయాణం అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు.
ఆర్టీసీ ఎండి సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యం, సంతృప్తి కోసం సంస్థ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని సిబ్బంది పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పి. విజయశ్రీ, డిపో సిబ్బంది పాల్గొన్నారు


Comments