గాలి కుంటు టీకాలు తప్పనిసరి – నిర్లక్ష్యం చేయొద్దు.
జిల్లా పశువైద్య అధికారి.
సత్తుపల్లి, నవంబర్ 1 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి మండల పరిధిలోని సిద్దారం, గౌరీగూడెం గ్రామాల్లో జరుగుతున్న ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ బోడేపూడి శ్రీనివాస్ రావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాడిరైతులు తమ పశువులకు తప్పనిసరిగా గాలి కుంటు వ్యాధి టీకాలు వేయించాలి. టీకాలు వేయించకపోతే వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. ఆవులు, ఎద్దులు గాలి కుంటు వ్యాధికి గురైతే పాల ఉత్పత్తి తగ్గి, పునరుత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుంది అని హెచ్చరించారు.
నాలుగు నెలలు దాటిన దూడలు, పశువులకు ఈ వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయాలని సూచించారు. రైతులు ఈ ఉచిత టీకా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నవంబర్ 13 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో మండల పశువైద్య అధికారి డాక్టర్ చింతనిప్పు శశిదీప్, లైవ్‌స్టాక్ అసిస్టెంట్లు వి. చైతన్య, డి. కరుణాకర్, వి. సాధిక్, ఎస్.కె. లాల్ బీ, ఓఎస్‌లు రాధా, మల్లికార్జున్, నాగేశ్వరరావు, శ్రీను, గోపాలమిత్ర సిబ్బంది రామకృష్ణ, సైదులు, విజయ్, రవి, శేషగిరి, చెన్నారావు, కిరణ్, వేణు తదితరులు పాల్గొన్నారు.


Comments