పీ.వి.ఎన్ కాలనీలో కమ్యూనిటీ హాల్ పరిశీలన.!

మౌలిక సదుపాయాల కల్పనకు ఐఎన్టీయూసీ బృందం విజ్ఞప్తి

పీ.వి.ఎన్ కాలనీలో కమ్యూనిటీ హాల్ పరిశీలన.!

సత్తుపల్లి, అక్టోబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):

స్థానిక సత్తుపల్లి పట్టణంలోని పీ.వి.ఎన్ సింగరేణి కాలనీలో నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ హాల్ పనులను ఐఎన్టీయూసీ బృందం పరిశీలించింది. కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ పనులు వేగంగా పూర్తి చేసి ఉద్యోగుల వినియోగానికి అందుబాటులోకి తేవాలని కోరారు.

అలాగే కాలనీలో ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఉద్యోగుల సంక్షేమం కోసం యాజమాన్యం మరింత కృషి చేయాలని రజాక్ అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ తీగల క్రాంతికుమార్, సెంట్రల్ కమిటీ నాయకులు మల్లారపు కొమరయ్య, రామారావు (ఫిట్ సెక్రటరీ–జే.వి.ఆర్.ఓసీ), బాలాజీ (ఫిట్ సెక్రటరీ–కిష్టారం ఓసీ), నాగేశ్వరరావు (ఫిట్ సెక్రటరీ–జే.వి.ఆర్.సి.హెచ్.పి), సత్తార్ (ఫిట్ సెక్రటరీ–ఏరియా వర్క్‌షాప్), అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ కోటి, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగేందర్, నాయకులు మురళి, మోసిన్, షట్రక్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!