మహిళా శ్రామికుల రక్షణకు డిమాండ్ మేడ్చల్ జిల్లా సదస్సులో నిర్ణయం

జిల్లా కన్వీనర్ కామ్రేడ్ ఎం. రేవతి కళ్యాణి

మహిళా శ్రామికుల రక్షణకు డిమాండ్ మేడ్చల్ జిల్లా సదస్సులో నిర్ణయం

IMG-20251019-WA0027మేడ్చల్ మల్కాజిగిరి, అక్టోబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):

మహిళా శ్రామికుల హక్కుల పరిరక్షణ కోసం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శ్రామిక మహిళ సదస్సు ఘనంగా జరిగింది. సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన ఈ సదస్సుకు జిల్లా కన్వీనర్ కామ్రేడ్ ఎం. రేవతి కళ్యాణి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “పని ప్రదేశాలలో మహిళలకు రక్షణ కల్పించాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. మున్సిపల్, ఆశా, అంగన్వాడి, మధ్యాహ్న భోజనం కార్మికులు వంటి స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలి,” అని డిమాండ్ చేశారు.అలాగే, బీసీడబ్ల్యూ కార్మికులకు వెల్ఫేర్ బోర్డుల ద్వారా సౌకర్యాలు పెంచాలని, మహిళా కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు పెన్షన్ కల్పించాలని ఆమె కోరారు. “మహిళా కార్మికుల బకాయిలను తక్షణం చెల్లించి, ప్రతి నెల బిల్లులు సమయానికి ఇవ్వాలి. మున్సిపల్ కార్మికుల కు ఆదివారం, పండగ సెలవు లు కల్పించకపోతే పోరాటం తప్పదని ఆమె హెచ్చరించారు.జిల్లా సహాయ కన్వీనర్ బి. శోభరాణి మాట్లాడుతూ, “స్కీమ్ వర్కర్లకు 26 వేల కనీస వేతనం తప్పనిసరి చేయాలి. మహిళలపై వివక్షను అరికట్టి, భద్రతా వాతావరణం కల్పించాలి” అని అన్నారు.
జిల్లా కోశాధికారి ఉన్నికృష్ణన్ మాట్లాడుతూ, “కేంద్ర బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ కరువైంది. పార్లమెంట్లో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించే సభ్యులను వెంటనే తొలగించాలని” డిమాండ్ చేశారు.ఈ సదస్సులో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ బి. శోభరాణి, అల్వాల్ ప్రాజెక్ట్ కార్యదర్శి శివరాణి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు అనిత, మున్సిపల్, ఇండస్ట్రియల్, అంగన్వాడి, మధ్యాహ్న భోజనం కార్మికులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!