టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు – సురక్షిత దీపావళి కోసం 108 సేవ పిలుపు
ఈఎంఆర్ఐ స్టేట్ హెడ్ సుధాకర్
పెద్దమందడి,అక్టోబర్19(తెలంగాణ ముచ్చట్లు):
దీపావళి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ 108 జీవీకే – ఈఎంఆర్ఐ హైదరాబాద్ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు సురక్షితంగా పండుగను జరుపుకోవాలని, నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు.108 ఈఎంఆర్ఐ స్టేట్ హెడ్ సుధాకర్ తెలిపారు, గత సంవత్సరాల అనుభవాల ప్రకారం, దీపావళి పండుగ సమయంలో సాధారణ రోజుకి పోలిస్తే 5–10 శాతం వరకు ప్రమాదాలు పెరుగే అవకాశం ఉంది. ముఖ్యంగా టపాసుల వల్ల కాలిన గాయాలు, రోడ్డు ప్రమాదాలు, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు అధికంగా ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ 256–300 వరకు ప్రమాదాలు జరుగుతున్నాయని గణాంకాలు చూపుతున్నాయి. పండుగలో టపాసులు సరైన విధంగా కాల్చకపోవడం, ధ్వని అధికంగా వచ్చే టపాసులు వాడడం ప్రధాన ప్రమాదాల కారణమని ఆయన గుర్తించారు.అత్యవసర పరిస్థితుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 108 అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచబడి, 24 గంటలుగా సంఘటన స్థలానికి వీలైనంత త్వరగా చేరుకునేందుకు బృందం సిద్ధంగా ఉంది. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినపుడు తక్షణం 108 కు కాల్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


Comments