పెద్దమందడి నూతన ఎంపీడీవో పరిణతను కలిసిన కాంగ్రెస్ మండల నాయకులు
Views: 3
On
పెద్దమందడి,నవంబరు01(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండల ప్రజా పరిషత్‌కు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీవో పరిణత ను శనివారం మండల కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు శాలువాతో సన్మానించి, ఎంపీడీవోను అభినందించారు.
కాంగ్రెస్ నేతలు ఎంపీడీవోని మండల అభివృద్ధికి సహకరించాలని, వివిధ గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండి, తన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తూ మండల అభివృద్ధికి కృషి చేయాలని అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతల్లో చీకరు చెట్టు తాండ గ్రామ మాజీ సర్పంచ్ రాధాకృష్ణ, పామిరెడ్డిపల్లి గ్రామకు చెందిన మధిర శ్రీశైలం, చిన్న మందడి గ్రామానికి చెందిన వాకిటి రవి, ఎంపీడీవో సిబ్బందిలో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు ఉన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
02 Nov 2025 21:47:09
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు):
రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు.
పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...


Comments