ఇంద్రనగర్ బస్తీ దవాఖానను సందర్శించిన ఎమ్మెల్యే
కాప్రా, అక్టోబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు)
బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని ఇంద్రనగర్ బస్తీ దవాఖానను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సందర్శించారు. ఆయనతో పాటు స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే బస్తీ దవాఖానలోని వైద్య సేవలపై అధికారులు, సిబ్బందిని ప్రశ్నించారు. గత ఆరు నెలలుగా డాక్టర్ల వేతనాలు అందడం లేదని సిబ్బంది ఎమ్మెల్యేకు తెలిపారు. అనంతరం ఫార్మసీని పరిశీలించిన ఎమ్మెల్యే ఎక్స్‌పైరీ అయిన టాబ్లెట్లు గుర్తించారు. అలాగే ఒక బాక్స్‌లో వేరొక మందు ప్యాకింగ్‌లో ఉండటం గమనించారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానల పరిస్థితి అధ్వానంగా మారిందని తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్సందీప్, సిబ్బంది మరియు స్థానిక నాయకులు వంజరి ప్రవీణ్ కరిపే, ఉల్లెం బాలరాజు, సాయి కుమార్, నవీన్ గౌడ్, కుమార్, పూస రమేష్, శేఖర్ గౌడ్, దండెం నరేందర్ తదితరులు పాల్గొన్నారు 


Comments