ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ జాయింట్ సెక్రటరీగా ఉడుత గణేష్
Views: 1
On
స్టేషన్ ఘనపూర్, అక్టోబర్ 20: తెలంగాణ ముచ్చట్లు
ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ హన్మకొండ జిల్లా జాయింట్ సెక్రటరీగా స్టేషన్‌ఘనపూర్ మండలంలోని తానేదార్‌పల్లి గ్రామానికి చెందిన ఉడుత గణేష్ నియమితులయ్యారు.
ఈ నియామకాన్ని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు మెరుగు రమేష్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఉడుత గణేష్ మాట్లాడుతూ —
“మానవహక్కుల పరిరక్షణ కోసం నిబద్ధతతో కృషి చేస్తాను. బడుగు బలహీన వర్గాల సంక్షేమం, న్యాయం కోసం నా వంతు పాత్రను నిర్వర్తిస్తాను. ప్రతి పౌరుడు తన హక్కులు తెలుసుకొని గౌరవప్రదంగా జీవించేందుకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తాను” అని పేర్కొన్నారు.
తన నియామకానికి సహకరించిన ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు బక్కి వంశీ కి గణేష్ కృతజ్ఞతలు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
02 Nov 2025 21:47:09
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు):
రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు.
పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...


Comments