సింగరేణి సత్తుపల్లికి కొత్త ఊపు.!
- ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న జిఎం పదవికి నియామకం.
- కార్యాలయంలో చింతల శ్రీనివాస్ చేరిక.
సత్తుపల్లి, నవంబర్ 1 (తెలంగాణ ముచ్చట్లు):
ఎదురుచూపులు ముగిశాయి. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న సత్తుపల్లి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ పదవికి నియామకం జరిగింది. సింగరేణి సంస్థ చైర్మన్ బలరాం ఉత్తర్వులతో చింతల శ్రీనివాస్‌ను సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్‌గా నియమించారు.
శనివారం ఆయన సత్తుపల్లి ఏరియా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జలగం వెంగళరావు, కిష్టారం గనుల సిబ్బంది, అధికారులు చింతల శ్రీనివాస్‌కు సాదర స్వాగతం పలికారు. అనంతరం జే.వి.ఆర్ ఓసి పరిధిలోని అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నూతన జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ మాట్లాడుతూ, నూతనంగా ఏర్పడిన సత్తుపల్లి ఏరియాను అధికారులు, కార్మికులు కలిసి శ్రమించి అభివృద్ధి దిశగా తీసుకెళ్దాం. యూనియన్ నాయకుల సూచనలు స్వీకరించి, కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తాను అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కిష్టారం ఓసి ప్రాజెక్టు అధికారి నరసింహారావు, జే.వి.ఆర్ ఓసి సీఓఎం రాజేశ్వరరావు, పిఈ శ్రీనివాస్, మేనేజర్ కళ్యాణరామ్, సి.హెచ్.పి ఇన్‌చార్జి సోమశేఖర్, కిష్టారం ఓసి మేనేజర్ రామకృష్ణ, సంక్షేమ అధికారులు దేవదాసు, శ్రీనివాస్, యూనియన్ నాయకులు సముద్రాల సుధాకర్, ఎం.డి. రజాక్, తీగల క్రాంతి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.


Comments