బీసీలందరూ ఐక్యతతో కలిసి మన హక్కులను మనం సాధించుకోవాలి
టిఆర్ఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్ డిమాండ్
ఎల్కతుర్తి అక్టోబర్ 19(తెలంగాణ ముచ్చట్లు)
హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన రైతు రక్షణ సమితి హనుమకొండ కరీంనగర్ జిల్లా ల అధ్యక్షులు హింగే భాస్కర్ శనివారం ఓ ప్రకటన తెలియజేశారు బీసీ రిజర్వేషన్ బందు లో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని డిమాండ్ చేశారు వామపక్ష పార్టీలు మద్దతు తెలిపిన అప్పటికి రైతు సంఘం నాయకుల ఆధ్వర్యంలో మా వంతు మద్దతు తెలుపుతున్నామని బీసీ లందరూ ఐక్యతతో కలిసి మన హక్కులను మనం సాధించుకోవాలని కోరారు బీసీల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేపట్టారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను చిన్న చూపు చూస్తే సహించేది లేదని వారు మండిపడ్డారు బిసి 42% రిజర్వేషన్ తలపెట్టిన బందుకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని అందుకుగాను ఎల్కతుర్తి మండలంలోని వాణిజ్య వ్యాపార సంస్థలు స్కూలు కాలేజీలు స్వచ్ఛందంగా రైతు సంఘం తరఫున బందుకు పిలుపునిస్తూ బంధు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగిందని ఈ సందర్భంగా రైతు రక్షణ సమితి హన్మకొండ కరీంనగర్ జిల్లాల అధ్యక్షులు హింగ్ భాస్కర్ తెలియజేశారు బీసీ రిజర్వేషన్ బీసీల ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి కృషి చేయాలని కోరారు.


Comments