మల్కాజ్‌గిరి ఘోర ప్రమాదం తప్పింది
కొండ పైభాగం నుంచి భారీ బండరాయి కిందకు జారిపడి చెత్త బండి మీద పడింది
మల్కాజ్గిరి, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):
మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ మల్లికార్జున నగర్ మెయిన్ రోడ్‌పై పెద్ద ప్రమాదం తప్పింది. రోడ్డుకు ఆనుకుని ఉన్న కొండ పైభాగం నుంచి భారీ బండరాయి కిందకు జారిపడి, అక్కడే నిలిపి ఉంచిన మున్సిపల్ చెత్త బండి మీద పడింది. రాయి బలానికి వాహనం పూర్తిగా ధ్వంసమైంది. అదృష్టవ శాత్తూ ఘటన సమయంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు.రోడ్డుమధ్యలో బండరాయి పడడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రతి శనివారం అదే ప్రాంతంలో కూరగాయల మార్కెట్ నిర్వహిస్తారని, మార్కెట్ సమయం లో ఈ ఘటన జరిగి ఉంటే పెద్ద ప్రమాదం తప్పేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.కొండపై ఇంకా ప్రమాదకర స్థితిలో ఉన్న రాళ్లను తక్షణమే తొలగించాలని, భద్రతా చర్యలు చేపట్టాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. 1985లో ఇదే ప్రాంతంలో పెద్ద రాళ్లు తొలగించి రోడ్డును విస్తరించిన విషయం గుర్తుచేసుకున్నారు.
ప్రమాదస్థలాన్ని పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని ట్రైన్ & బస్ ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నూర్ మున్సిపల్, జిహెచ్‌ఎంసి అధికారులను కోరారు


Comments