కంప్యూటర్ల మరమ్మత్తుకు టెండర్లు దాఖలు చేయాలి....
అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
ఖమ్మం బ్యూరో, నవంబర్ 01, తెలంగాణ ముచ్చట్లు;
జిల్లాలోని 84 ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న కంప్యూటర్స్ మరమ్మత్తు కొరకు ఆసక్తి గల వారు నవంబర్ 6 లోపు టెండర్లు దాఖలు చేయాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఉన్న 84 ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్స్ కు మరమ్మత్తులు చేసేందుకు ఆసక్తిగల అభ్యర్థుల నుండి టెండర్లు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. కంప్యూటర్ మరమ్మత్తుల నిమిత్తం 69 ఉన్నత పాఠశాలలకు 15 వేల రూపాయలు చొప్పున, 15 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు 5 వేల రూపాయల చొప్పున మొత్తం 11 లక్షల పదివేల రూపాయలు కేటాయించడం జరిగిందని అదనపు కలెక్టర్ తెలిపారు.
ఆసక్తి గల ఖమ్మం జిల్లాకు చెందిన అభ్యర్థులు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో 4 వేల రూపాయలు చెల్లించి దరఖాస్తు తీసుకుని, 50 వేల రూపాయలు జిల్లా కలెక్టర్, చైర్మన్, సమగ్ర శిక్షా, ఖమ్మం పేరిట డీడీ తీసి నవంబర్ 3 నుంచి నవంబర్ 6 సాయంత్రం 5.00 గంటల వరకు టెండర్లు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో దాఖలు చేయాలని అన్నారు. గడువు దాటిన పిదప వచ్చిన టెండర్లు, తపాల ద్వారా వచ్చిన దరఖాస్తులు స్వీకరించడం జరగదని అన్నారు. సీల్డ్ కవర్ టెండర్లను నవంబర్ 8న ఉదయం 11.00 గంటలకు అదనపు కలెక్టర్ సమక్షంలో తెరిచి ఫైనల్ చేయడం జరుగుతుందని అదనపు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


Comments