పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం

పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం

నాచారం, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):

పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాచకొండ మల్కాజ్‌గిరి డీసీపీ పద్మజ ఆధ్వర్యంలో మల్లాపూర్‌లోని వీ.ఎన్.ఆర్ గార్డెన్స్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరంలో ఘట్కేసర్ ఏసీపీ చక్రపాణి, సీఐ బాలస్వామి, ఎస్‌ఐ హీనా పాల్గొని రక్తదాతలను అభినందించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల సేవలను చిరస్మరణీయంగా నిలుపుకోవాలన్నారు.WhatsApp Image 2025-10-30 at 7.44.07 PM సమాజంలో రక్తదానం అత్యంత మహత్తర సేవ అని, ప్రతి ఒక్కరూ ఇటువంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.శిబిరంలో ఘట్కేసర్ మైనార్టీ యువత, ప్రజాప్రతినిధులు, సామాజిక సేవా సంస్థలు, వాలంటీర్లు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదాతల తో పాటు పోలీస్ సిబ్బంది కూడా రక్తదానం చేస్తూ సేవాస్ఫూర్తిని చాటారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!