నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు

వరి పంటను పరిశీలిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు

పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు):

రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు.

పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి పల్లి గ్రామంలో మాజీ ఎంపీపీ మన్నెపు రెడ్డి సాగుచేసిన వరి పంటను బెంగాల్ ప్రాంతానికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు స్థానిక వ్యవసాయ అధికారులు పరిశీలించారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మన్నెపు రెడ్డి మాట్లాడుతూ.. డి.ఆర్.ఆర్–75 సీడ్ వరి విత్తనాలను వాడడంతో అధిక దిగుబడి వచ్చింది. ఒక్క ఎకరాకు సుమారు 50 క్వింటాళ్ల వరకూ పంట దిగుబడి నమోదైంది అని తెలిపారు.

దిగుబడి అధికంగా రావడంతో జిల్లాలోని వివిధ గ్రామాల నుండి రైతులు పెద్దఎత్తున వచ్చి ఈ వరి పంటను పరిశీలించారు. వారు సీడ్ విత్తనాల వివరాలు తెలుసుకున్నారు.

రైతులకు నాణ్యమైన వరి విత్తనాలు అవసరమైతే ఫోన్ నంబర్‌: 9908161633 కు సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.అధిక దిగుబడి కోసం తప్పనిసరిగా నాణ్యత కలిగిన విత్తనాలను మాత్రమే వాడాలని సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!