నిద్రపోతున్న నిఘానేత్రాలు !

పట్టించుకోని అధికారులు

నిద్రపోతున్న నిఘానేత్రాలు !

ప్రశ్నార్థకంగా పలు గ్రామాల భద్రత
 
•వేలేరు మండలంలో ఇటీవల  దొంగతనాలు
 
వేలేరు,అక్టోబర్21(తెలంగాణ ముచ్చట్లు):
 
వేలేరు మండలంలోని పీచర, గుండ్లసాగర్, కన్నారం, కమ్మరిపేట వంటి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో గ్రామాల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. కెమెరాల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
 
కొన్ని గ్రామాల్లో కెమెరాలకు ఏర్పాటు చేసిన బాక్స్‌లు పక్షులకు గూళ్లుగా మారి ఉండడం, భద్రతా వ్యవస్థ పట్ల అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది. భద్రత కోసం ఏర్పాటు చేసిన ఈ నిఘానేత్రాలు నిష్క్రియంగా మారడం పట్ల ప్రజలు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
“గ్రామాల భద్రత కోసం ఏర్పాటైన సీసీ కెమెరాలు పనిచేయకపోతే ప్రజల రక్షణ ఎలా సాధ్యం?” అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితిని దొంగలు సద్వినియోగం చేసుకుంటూ వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో బర్లు, గొర్రెలు, మోటార్లు దొంగిలించబడిన ఘటనలు చోటు చేసుకున్నాయని వారు గుర్తు చేశారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకొని సీసీ కెమెరాలను మరమ్మతు చేసి, అవి పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!