డాక్టర్ ఏఎస్‌ రావు 22వ వర్ధంతి 

స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో నివాళులు

డాక్టర్ ఏఎస్‌ రావు 22వ వర్ధంతి 

ఏ ఎస్ రావు నగర్, నవంబర్ 1 (తెలంగాణ ముచ్చట్లు):

ప్రముఖ శాస్త్రవేత్త, ఈసీఐఎల్ వ్యవస్థాపకుడు, పద్మభూషణ్ డాక్టర్ ఏఎస్‌ రావు 22వ వర్ధంతి సందర్భంగా కమలానగర్ సిఐటియు కార్యాలయ ప్రాంగణంలో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరి రావు అధ్యక్షత వహించారు.డాక్టర్ ఏఎస్‌ రావు చిత్రపటానికి ఈసీఐఎల్ మాజీ ఉద్యోగులు ఎం. భాస్కర్‌రావు, జి. శివరామ కృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్ఫూర్తి గ్రూప్ నాయకులు, ఈసీఐఎల్ మాజీ ఉద్యోగి జి. శివరామకృష్ణ మాట్లాడుతూ పేదరికంలో పుట్టి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న డాక్టర్ ఏఎస్‌ రావు ఉన్నత విద్య సాధించి భారతదేశానికి సేవ చేసిన గొప్ప శాస్త్రవేత్త అని పేర్కొన్నారు. వివక్షను ఎదుర్కొన్నప్పటికీ నిస్వార్థ సేవ, మానవతా భావంతో ముందుకు సాగిన వ్యక్తి ఆయన అన్నారు.అమెరికాలో విద్యను అభ్యసించినప్పటికీ దేశ సేవ కోసం తిరిగి వచ్చి డాక్టర్ హోమీ జే. బాబాతో కలిసి అణుశక్తి పరిశోధనల్లో కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఈసీఐఎల్ పరిశ్రమలను నిర్మించడం ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధిని కల్పించిన మహనీయుడని అన్నారు.ఈ సందర్భంగా స్పూర్తి గ్రూప్ అధ్యక్షుడు గొడుగు యాదగిరిరావు, నాయకులు ఉదయ భాస్కర్, భాస్కర్‌రావు ప్రసంగించారు.తరువాత సభ్యులంతా డాక్టర్ ఏఎస్‌ రావు చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో ఎం. శ్రీనివాసరావు, ఉమామహేశ్వర రావు, శోభ, గౌసియా, బ్రహ్మం, ఆర్‌ఎస్‌ఆర్ ప్రసాద్, ప్లంబర్ పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!