ప్రమాద బాధితుడిని పరామర్శించిన తుమ్మల యుగంధర్.
సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష.
సత్తుపల్లి, నవంబర్ 1 (తెలంగాణ ముచ్చట్లు):
కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో అక్టోబర్ 24న జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో గాయపడిన సత్తుపల్లి పట్టణానికి చెందిన మన్నేపల్లి సత్యనారాయణను రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ తుమ్మల యుగంధర్ శనివారం పరామర్శించారు.
హైదరాబాద్‌లోని డి.ఆర్.డి.ఓ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న సత్యనారాయణ అధికార పనిమీద హైదరాబాదు నుండి బెంగళూరు వెళ్తుండగా ఆయన ప్రయాణించిన బస్సు కర్నూలు సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆయనకు గాయాలు కాగా, అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పించుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న తుమ్మల యుగంధర్ స్వయంగా సత్యనారాయణ నివాసానికి చేరుకుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు రాజబాబు, విద్యాసంఘ నాయకులు నాయుడు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


Comments