కుషాయిగూడలో అమరవీరు ల సంస్మరణ ర్యాలీ
కుషాయిగూడ, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల లో భాగంగా కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈసీఐఎల్ క్రాస్ రోడ్ నుండి తాళ్లూరి క్రాస్ రోడ్ వరకు సాగిన ఈ ర్యాలీలో సుమారు 90 మంది కళాశాల విద్యార్థులు, యువత మరియు స్థానికులు పాల్గొన్నారు.తాళ్లూరి క్రాస్ రోడ్ వద్ద అమరవీరులకు ఒక నిమిషం మౌన నివాళి అర్పించారు. అనంతరం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎన్. రామ లక్ష్మణ రాజు మాట్లాడుతూ... దేశ భద్రత కోసం ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమన్నారాయన. యువతలో దేశభక్తి, సేవాభావం పెంపొందేలా ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.ట్రాఫిక్ నియమాలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ట్రాఫిక్ అవగాహన కీలకమని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్‌హెచ్‌ఓ ఎన్. రామ లక్ష్మణ రాజు, ఎస్‌ఐలు జి. మధు, లింగారెడ్డి, భాస్కర్ తదితరులు విజయవంతంగా నిర్వహించారు.


Comments