గంజాయి పీలుస్తూ పట్టుబడ్డ ఇద్దరు యువకులు.

గంజాయి పీలుస్తూ పట్టుబడ్డ ఇద్దరు యువకులు.

సత్తుపల్లి, అక్టోబరు 30 (తెలంగాణ ముచ్చట్లు): 

చెడు స్నేహాల బారిన పడి మత్తు మాయలో మునిగిపోయిన ఇద్దరు యువకులు గంజాయి పీలుస్తూ పట్టుబడ్డారు. పోలీసులు వారివద్ద నుండి వంద గ్రాముల గంజాయి, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన సత్తుపల్లి పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం — సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామానికి చెందిన కువ్వారపు సతీష్ కుమార్ (వయస్సు 20 సంవత్సరాలు, వేంకటేశ్వరరావు కుమారుడు, మాదిగ, రంగులు వేసే పనివాడు) మరియు మరో 17 సంవత్సరాల వయస్సు గల మైనర్ బాలుడు చెడు స్నేహితుల ప్రభావానికి లోనై గత నాలుగేళ్లుగా తాగుడు, గంజాయి పీల్చడం అలవాటు చేసుకున్నారు.

వీరు గతంలో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద చిన్న పొట్లాలలో గంజాయి కొనుగోలు చేసేవారు. ఆంధ్ర–ఒడిశా సరిహద్దులో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని తెలుసుకున్న వీరు అక్టోబరు 25వ తేదీ రాత్రి సత్తుపల్లి నుండి బయలుదేరి ఆవులపాక గ్రామానికి వెళ్లి, భగవాన్ అనే వ్యక్తి వద్ద నుండి అర కిలో గంజాయి కొనుగోలు చేశారు. అనంతరం ఇద్దరూ కలిసి ఆ గంజాయిని పీల్చారు.

ఈ రోజు కూడా మెట్ట ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలోని వైకుంఠ ధామం వద్ద గంజాయి పీల్చిన తరువాత, మరలా కొనుగోలు చేసేందుకు డబ్బుల కొరకు మిగిలిన గంజాయిని అమ్ముదామని నిర్ణయించారు. ఇద్దరూ కలిసి గంజాయి పొట్లాను మోటార్ సైకిల్ ట్యాంక్ కవర్‌లో దాచుకొని ప్రయాణిస్తుండగా, పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా, పోలీసులు వెంటపడి పట్టుకున్నారు.

వారి వద్ద నుండి వంద గ్రాముల గంజాయి, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై మత్తు పదార్థాల నియంత్రణ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి సత్తుపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు.

ప్రభుత్వం గంజాయి నిరోధక కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా కొనసాగిస్తున్న నేపథ్యంలో, ఎవరైనా గంజాయి కొనుగోలు చేసినా, అమ్మినా లేదా పీల్చినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇట్టి అక్రమ చర్యల గురించి సమాచారం అందజేసే వారికి తగిన బహుమతి ఇవ్వబడుతుందని, వారి పేర్లను రహస్యంగా ఉంచుతామని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!