ఆడబిడ్డపై కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు
బీఆర్‌ఎస్ నేత స్వరూప మండిపాటు
ములుగు,అక్టోబర్23(తెలంగాణ ముచ్చట్లు):
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్న రాజకీయ నాటకాలపై బీఆర్‌ఎస్ ములుగు జిల్లా మహిళా సీనియర్ నాయకురాలు పూర్రి స్వరూప తీవ్రంగా స్పందించారు. దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణాంతరం వచ్చిన ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి గెలిచే ముఖం కనిపించక చిల్లర రాజకీయాలకు తెరతీసిందని ఆమె విమర్శించారు.
మాగంటి గోపీనాథ్ కుమారుడిని అంటూ ఒక అనామక వ్యక్తితో ఫిర్యాదు చేయించడం కాంగ్రెస్ రాజకీయ దౌర్భాగ్యానికి నిదర్శనమని స్వరూప అన్నారు. “మాగంటి గోపీనాథ్ కుమారుడని చెప్పుకుంటున్న ఆ వ్యక్తి ఇన్ని ఏళ్లుగా ఎక్కడ ఉన్నాడు? తన తండ్రి అంత్యక్రియలపుడు ఎందుకు కనిపించలేదు?” అని ఆమె ప్రశ్నించారు.
రాజకీయంగా దమ్ములేని కాంగ్రెస్ నాయకులు నైతికంగా సునిత గెలుపును అంగీకరించలేక ఆడబిడ్డపై దొంగనాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. “భర్తను కోల్పోయిన మహిళ దుఃఖంలో ఏడుస్తే, మంత్రిపదవి కోసం ఆ ఏడుపునే అవమానపరచడం అనాగరికం” అని స్వరూప అన్నారు.
తండ్రి ఆశయాల సాధనలో కాలు విరిగిన సునిత నిబద్ధతను ప్రజలు గమనిస్తున్నారని, ఆ త్యాగాన్ని అవమానపరచడానికి కాంగ్రెస్ నేతలు వేసే అబద్ధపు కేసులు ప్రజల తీర్పుతో తుడిచిపెట్టుకుపోతాయని హెచ్చరించారు. “ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్తారు” అని పూర్రి స్వరూప వ్యాఖ్యానించారు.


Comments