ప్రజల ఆరోగ్యం కోసం యువ డాక్టర్ల ముందడుగు ఎమ్మెల్యే
మర్రి రాజశేఖర్ రెడ్డి
Views: 4
On
మల్కాజ్‌గిరి, నవంబర్ 1 (తెలంగాణ ముచ్చట్లు):
గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని వాణి నగర్‌లో సంతోషి డెంటల్ హాస్పిటల్‌ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్‌తో కలిసి హాస్పిటల్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించడంలో ప్రైవేట్ హాస్పిటల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. వాణి నగర్ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఈ హాస్పిటల్ ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణలో యువ వైద్యులు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.ఈకార్యక్రమంలో డాక్టర్ సంతోషి, డాక్టర్ సిద్ధార్థ వర్మ కృష్ణ చావ్లి, ప్రవీణ్, కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
02 Nov 2025 21:47:09
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు):
రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు.
పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...


Comments