బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం ఈటల రాజేందర్
బంజారాహిల్స్,నవంబర్ 2 (తెలంగాణ ముచ్చట్లు):
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు బిక్ష కాదు, మాకు రాజ్యాంగబద్ద హక్కు అని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బంజారాహిల్స్‌లోని కళింగ భవన్‌లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రధాన అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈటల రాజేందర్,
“ఉద్యమాలకు పుట్టినిల్లు తెలంగాణ. మన సమాజం ఎప్పుడూ చైతన్యంతో ఉంటుంది. అన్యాయం, అసమానతలను తట్టుకోదు” అని అన్నారు.జేఏసీ రాజకీయాలకు అతీతంగా ఉండాలి జేఏసీ అందరిది కావాలి, ఒకే సిద్ధాంతం — బీసీలకు న్యాయం సాధించటమని అన్నారు. రాజకీయ నాయకుడు కాకుండా నిక్కచ్చిగా నడిపే నాయకత్వం జేఏసీలోకి రావాలని సూచించారు. “అన్ని పార్టీలను భాగస్వామ్యులుగా చేసుకుంటేనే ఉద్యమం విజయవంతం అవుతుంది” అని గుర్తు చేశారు.బీసీ సీఎం ఎప్పుడెప్పుడు?“స్వాతంత్ర్యం వచ్చిన 78 ఏళ్లయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకూ బీసీ సీఎం ఎందుకు రాలేదు? మనకే పెద్ద సంఖ్య ఉన్నా మనం అధికారం ఎందుకు పొందలేకపోయాం అనేది మనం ఆలోచించుకోవాలి” అని ప్రశ్నించారు.డబ్బు రాజకీయం నిర్మూలనడబ్బుతో ఎన్నికలు గెలిచే వ్యవస్థను జేఏసీ ఎదిరించాలని సూచించారు.
“డబ్బు రాజకీయాలు ఉన్నంతకాలం ప్రజా ప్రతినిధిత్వ నాణ్యత దెబ్బతింటుంది. డబ్బులు ఎరవేసేవారు ఉన్నంతకాలం నిజమైన సామాజిక నాయకులు గెలవడం కష్టం” అని అన్నారు.బీసీలకు మంత్రివర్గంలో వాటా తప్పనిసరి కేవలం స్థానిక సంస్థల్లోనే కాదు, చట్టసభలలో, మంత్రివర్గంలోనూ బీసీలకు తగిన ప్రాతినిధ్యం అందాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.ఉద్యమానికి సంపూర్ణ మద్దతు“ఈ పోరాటం కోట్ల మంది భవిష్యత్తుకు సంబంధించినది. ఆశయాన్ని సాధించే వరకు ఆగకండి. మీ సంకల్పానికి నేను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను” అని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.


Comments