విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
కీసర డివిజన్ విద్యుత్ అధికారుల ప్రజలతో సమావేశం
కీసర, నవంబర్ 2 (తెలంగాణ ముచ్చట్లు)
కీసర డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తోంది. సోమవారం ఉదయం 10.30 గంటలకు నాగారం వద్ద కె.కె. గార్డెన్ ఎదురుగా ఉన్న విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది.ఈ సందర్భంగా వినియోగదారులు తమ విద్యుత్ సంబంధిత ఫిర్యాదులు, అర్జీలు, సలహాలను నేరుగా అధికారులకు సమర్పించవచ్చని అధికారులు తెలిపారు. బిల్లుల సమస్యలు, వోల్టేజ్ లోపాలు, ట్రాన్స్‌ఫార్మర్ సమస్యలు, మీటర్ లోపాలు, కొత్త కనెక్షన్లు మరియు ఇతర సేవలకు సంబంధించిన అంశాలు ఈ సమావేశంలో చర్చించబడనున్నాయి.“ప్రజల ఫిర్యాదులు వెంటనే స్వీకరించి, సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం” అని డివిజనల్ ఇంజనీర్ తాళ్లపల్లి లింగయ్య తెలిపారు. ఈ సమావేశానికి ఏఈలు, జేఈలు మరియు లైన్ స్టాఫ్ తదితర అధికారులు హాజరుకానున్నారు.విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సమావేశానికి హాజరై తమ సమస్యలను తెలియజేయాలని విద్యుత్ శాఖ విజ్ఞప్తి చేసింది.
*వినియోగదారులకు సూచనలు:
బిల్లులు లేదా మీటర్ వివరాలు వెంట తీసుకురావాలి ఫిర్యాదు వివరాలు రాతపూర్వకంగా ఇచ్చితే వేగంగా పరిష్కారం గృహాలయాలు,వాణిజ్య, పరిశ్రమల వినియోగదారులు హాజరు కావచ్చును


Comments