అశ్వారావుపేట అభివృద్ధికి ఎమ్మెల్యే జారె కృషి.!

మినీ స్టేడియం, కొత్త వెటర్నరీ ఆసుపత్రుల భవనాల కోసం మంత్రి శ్రీహరికి వినతి.

అశ్వారావుపేట అభివృద్ధికి ఎమ్మెల్యే జారె కృషి.!

అశ్వారావుపేట, అక్టోబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):

అశ్వారావుపేట నియోజకవర్గం అభివృద్ధి దిశగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముందడుగు వేశారు. రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ అభివృద్ధి, మత్స్య, క్రీడలు–యువజన సర్వీసుల శాఖల మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వాకిటి శ్రీహరిని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా చండ్రుగొండ మండలంలో మినీ స్టేడియం ఏర్పాటు చేయడంతో పాటు, నియోజకవర్గంలోని శిథిలావస్థలో ఉన్న పశువైద్య ఆసుపత్రుల స్థానంలో నూతన భవనాలను మంజూరు చేయాలని ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు.

నియోజకవర్గ ప్రజల అవసరాలు, స్థానిక పరిస్థితులను మంత్రి దృష్టికి తీసుకెళ్లి తక్షణ చర్యలు చేపట్టాలని అభ్యర్థించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .