ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి
కాప్రా తహసిల్దార్ బైరెడ్డి రాజేష్ కు వినతి తాడూరి గగన్ కుమార్
కాప్రా, అక్టోబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రభుత్వ భూముల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు సాధన సమితి మేడ్చల్ జిల్లా కన్వీనర్ తాడూరి గగన్ కుమార్ కాప్రా తహసిల్దార్ బైరెడ్డి రాజేష్ కు విజ్ఞప్తి చేశారు.తహసిల్దారుగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన బైరెడ్డి రాజేష్‌ను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గగన్ కుమార్ మాట్లాడుతూ కాప్రా మండల పరిధిలోని ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.ఇప్పటి వరకు తహసిల్దార్‌గా పనిచేసిన సుచరిత కాపాడిన ప్రభుత్వ భూములను అలాగే సంరక్షించాలని సూచించారు. వివిధ సర్వే నంబర్లలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ సూచిక బోర్డులు, కంచెలు కొనసాగేటట్లు చూడాలని అభ్యర్థించారు.దీనిపై బైరెడ్డి రాజేష్ సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు ఉండదని హామీ ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని, భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింహా చారి, నగేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments