పారిశుధ్య కార్మికులకు స్వీట్ బాక్స్ పంపిణీ
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ ప్రభుదాస్ పాల్గొనడం
కాప్రా, అక్టోబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు)
దీపావళి పండుగ సందర్భంగా హెచ్‌బీ కాలనీ ఫేజ్–1 బీఆర్ఎస్ నాయకులు దేవేందర్ కుమార్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు స్వీట్ బాక్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి పాల్గొని కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “పారిశుధ్య కార్మికులు సమాజ పరిశుభ్రతకు, ఆరోగ్య భద్రతకు ఎంతో కృషి చేస్తున్నారు. వారికి పండుగ సందర్భంలో గుర్తింపు ఇవ్వడం అభినందనీయం” అని తెలిపారు. దేవేందర్ కుమార్ ఈ కార్యక్రమం ద్వారా మంచి ఉదాహరణ చూపించారని ఆయన ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో ఫేజ్–1 అధ్యక్షులుశివరాం ప్రసాద్, ప్రతాప్ రెడ్డి, ప్రసాద్, చక్రవర్తి, పూస రమేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments