ఎల్.ఓ.సి మంజూరు చేసి బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే

ఎల్.ఓ.సి మంజూరు చేసి బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే

వనపర్తి,అక్టోబర్23(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామానికి చెందిన జెనిల సాయిబాబా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యం కోసం అవసరమైన ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఆయన వనపర్తి శాసనసభ్యులు  తూడి మేఘారెడ్డి ని సంప్రదించి ఆర్థిక సహాయం కోరారు.బాధితుడి పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి  సానుకూలంగా స్పందించి, ఆయన చికిత్స కోసం రూ. 2 లక్షల 50 వేల రూపాయల విలువైన ఎల్.ఓ.సి (లెటర్ ఆఫ్ క్రెడిట్) మంజూరు చేయించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించారు.మంజూరైన ఎల్.ఓ.సి పత్రాన్ని గురువారం హైదరాబాద్ మాదాపూర్‌లోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి  బాధిత కుటుంబ సభ్యులకు స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా తమకు ఆపత్కాలంలో ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచినందుకు బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే మేఘారెడ్డి కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!