అమరుల త్యాగాలు వెలకట్టలేనివి సంస్మరణ దినోత్సవం 

అమరుల త్యాగాలు వెలకట్టలేనివి సంస్మరణ దినోత్సవం 

రాచకొండ సీపీ సుధీర్ బాబు ఐపీఎస్

అంబర్‌పేట్, అక్టోబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ అంబర్‌పేట్ కార్ హెడ్‌క్వార్టర్స్‌లో డీసీపీలు, పోలీసు అధికారులతో కలిసి పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ —
“శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి. సమాజం ఎల్లప్పుడూ వారికి రుణపడి ఉంటుంది. విధి నిర్వహణలో సంఘవిద్రోహ శక్తులతో పోరాడుతూ ప్రాణాలు అర్పించిన పోలీసులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత” అని అన్నారు.తీవ్రవాదుల చేతుల్లో అమరులైన 16 మంది పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా సత్కరించారు. వారి కుటుంబాలతో మమేకమై, వారి సమస్యలు, అవసరాలు తెలుసుకొని ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని కమిషనర్ భరోసా ఇచ్చారు.రక్తదాన శిబిరం ప్రారంభం అమరవీరుల జ్ఞాపకార్థం అంబర్‌పేట్ కార్ హెడ్‌క్వార్టర్స్‌లో రక్తదాన శిబిరాన్ని కమిషనర్ సుధీర్ బాబు ప్రారంభించారు. రాచకొండ కమిషనరేట్ పరిధి నుంచి వందలాది పోలీసులు పాల్గొని రక్తదానం చేశారు. “అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రక్తదాన కార్యక్రమం నిర్వహించడం ద్వారా సమాజానికి సేవ అందించడం గర్వకారణం” అని కమిషనర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ పద్మజా ఐపీఎస్, ఎల్‌బీ నగర్ డీసీపీ అనురాధ ఐపీఎస్, డీసీపీ (క్రైమ్స్) అరవింద్ బాబు, డీసీపీ (అడ్మిన్) ఇందిరా, డీసీపీ (విమెన్ సేఫ్టీ) ఉషారాణి, డీసీపీ (మహేశ్వరం) సునీత రెడ్డి, డీసీపీ (ట్రాఫిక్–1) శ్రీనివాస్, డీసీపీ (ట్రాఫిక్–2) శ్రీనివాసులు, డీసీపీ (సైబర్ క్రైమ్స్) నాగలక్ష్మి, డీసీపీ (రోడ్ సేఫ్టీ) మనోహర్, డీసీపీ (హెడ్‌క్వార్టర్స్) శ్యామ్ సుందర్, అదనపు డీసీపీలుఏసీపీలు తదితరులు పాల్గొన్నారుIMG-20251021-WA0034

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!