గ్రూప్-1 ర్యాంకర్లను సన్మానించిన ఎమ్మెల్యే నాయిని
హనుమకొండ,అక్టోబర్21 (తెలంగాణ ముచ్చట్లు):
ఇటీవల తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన గ్రూప్-1 ఫలితాల్లో హనుమకొండ జిల్లాకు గర్వకారణంగా నిలిచిన అభ్యర్థులను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.గ్రూప్-1లో ప్రతిభను చాటిన బండారి అన్వేష్ (డీఎస్‌పీ), సంఘాల జశ్వంత్ రాజ్ (డీఎస్‌పీ), పోతరాజు పవన్ (మునిసిపల్ కమిషనర్) లను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ — హనుమకొండ జిల్లాకు చెందిన మేధావులు అత్యున్నత స్థాయి పోటీ పరీక్షల్లో విజయాలు సాధించడం గర్వకారణమని, ఇది యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. భవిష్యత్‌లో కూడా నియోజకవర్గం నుంచి మరెందరో యువతి యువకులు ప్రభుత్వ పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో యువతకు విస్తృత అవకాశాలు లభిస్తున్నాయని, ఉద్యోగ నియామక పత్రాలను సీఎం చేతుల మీదుగా అందుకోవడం మరింత గౌరవకరమైన విషయమని తెలిపారు.
పేద ప్రజలకు న్యాయం అందేలా, సమాజ అభివృద్ధికి కొత్తగా ఎంపికైన అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే నాయిని సూచించారు.


Comments