వేమన శతక పుస్తక పంపిణీ కార్యక్రమం ప్రారంభం.!
ఆషా సంస్థ విద్యార్ధులకు ఉచితంగా రెండు వేల పుస్తకాలు అందిస్తోంది.
Views: 9
On

సత్తుపల్లి, అక్టోబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
ఆషా స్వచ్ఛంద సంస్థ ప్రచురించిన వేమన శతక పుస్తకాలను ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్ పంపిణీ చేశారు. గురువారం సత్తుపల్లిలో జరిగిన కార్యక్రమంలో దయానంద్ మాట్లాడుతూ, ఆషా సంస్థ ఆధ్వర్యంలో రెండు వేల వేమన శతక పుస్తకాలను ప్రచురించినట్లు తెలిపారు.
సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఈ పుస్తకాలను విద్యార్ధులకు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్ధులు వంద పద్యాలు నేర్చుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కూడా దయానంద్ కోరారు.
గార్లపాటి-బొల్లేపల్లి ట్రస్ట్ నిర్వాహకులు రామకృష్ణ, మధుసూదన రాజు, వేమన పద్యాలు మాతృభాష అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో విశ్వశాంతి విద్యాలయం ప్రిన్సిపల్ పసుపులేటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
02 Nov 2025 21:47:09
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు):
రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు.
పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...


Comments