వరి కొనుగోలు నాణ్యత ప్రమాణాలపై శిక్షణా కార్యక్రమం
పెద్దమందడి మండల వ్యవసాయ శాఖ అధికారి సైదుల్ యాదవ్
పెద్దమందడి,అక్టోబర్22( తెలంగాణ ముచ్చట్లు):
వానాకాలం 2025–26 వరి కొనుగోలు సీజన్‌కు ముందుగా, రైతులకు నాణ్యత ప్రమాణాలపై అవగాహన కల్పించేందుకు బుధవారం పామిరెడ్డి పల్లి రైతు వేదికలో మండల స్థాయి శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో పెద్దమందడి మండల వ్యవసాయ శాఖ అధికారి సైదులు యాదవ్ మాట్లాడుతూ..
వరి కొనుగోలు సమయంలో ప్రతి క్వింటాల్ ధాన్యం తేమ శాతం, రకాన్ని కచ్చితంగా గుర్తించి మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. రైతులు ప్రభుత్వ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా వరిని ఎండబెట్టి, శుభ్రంగా ఉంచితే లాభదాయకంగా విక్రయం జరుగుతుందని వివరించారు.
అలాగే కొనుగోలు కేంద్రాల్లో పి.ఎ.సి.ఎస్ మరియు ఐ.కే.పీ సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం తూకం, రేటు నిర్ణయం జరగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దారు, సహాయక ప్రాజెక్టు మేనేజర్, పి.ఎ.సి.ఎస్ ప్రధాన కార్యనిర్వాహక అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారులు, పి.ఎ.సి.ఎస్ మరియు ఐ.కే.పీ సిబ్బంది పాల్గొన్నారు.


Comments