బీసీ సంక్షేమ సంఘ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఇజ్జరాతి నాగేశ్వరావు

బీసీ సంక్షేమ సంఘ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఇజ్జరాతి నాగేశ్వరావు
జిల్లా నియామక పత్రాన్ని అందజేస్తున్న ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు

 కాజీపేట్ అక్టోబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు) 

హనుమకొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షునిగా ఇజ్జరాతి నాగేశ్వరరావు( చిన్న) ను  నియమిస్తూ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ. వేణుగోపాల్ గౌడ్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా హనుమకొండ జిల్లాలో బీసీ కులాల ఐక్యత కోసం చేస్తున్న కృషిని గుర్తించి తనకు ఈ పదవి రావడం వల్ల తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు జాజుల. శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు బైరి. రవి కృష్ణ ,వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ. వేణుగోపాల్ గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాడి. మల్లయ్య యాదవ్ బీసీ జేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్ బోనగాని. యాదగిరి గౌడ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హన్మకొండ నగరంలో బీసీ కులాలను చైతన్యం చేస్తూ బీసీ లందర్ని ఏకతాటిపైకి తీసుకొని వచ్చి  రాజ్యాధికారం వచ్చేలా తాను ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. బీసీలు చైతన్యవంతులై రాజకీయ రంగాలలో చురుగ్గా పాల్గొని తమదైన శైలిలో రాజ్యాధికారాన్ని దక్కించుకోవాలని ఆయన కోరారు.

నాగేశ్వరరావు ఎంపిక పట్ల పలువురి హర్షం

ఇజ్జరాతి నాగేశ్వరావు హనుమకొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా పదవిని ఇవ్వడం పట్ల అంజిరెడ్డి,  నాగేష్, చందు, ధనుంజయరావు, యాకూబ్, అభి , పప్పీ  మార్బుల్ అండ్ గ్రానైట్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ భాష లతోపాటు ఉస్మాన్ భాష అంకుష్ భాష లతోపాటు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!