శ్రీనివాస్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం నూతన కమిటీ బాధ్యతల స్వీకారం

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరు

శ్రీనివాస్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం నూతన కమిటీ బాధ్యతల స్వీకారం

ఏ ఎస్ రావు నగర్ ,అక్టోబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా సర్కిల్, ఏ.ఎస్.రావు నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ శ్రీనివాస్ నగర్ హౌసింగ్ కాలనీ సంక్షేమ సంఘం నూతన కమిటీ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ,“కాలనీ అభివృద్ధిలో సంక్షేమ సంఘాల పాత్ర అత్యంత కీలకం. కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ దశలవారీగా అభివృద్ధి పనులు చేపడతాం” అని అన్నారు.డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, “ఏ.ఎస్.రావు నగర్ డివిజన్‌ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం. కాలనీ అభివృద్ధికి సంక్షేమ సంఘం సహకారం ఎంతో అవసరం” అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా నూతన కమిటీగా అధ్యక్షుడిగా వీఎస్ఎన్ సత్యనారాయణ (నాగు), ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్ రెడ్డి, చె. రాజిరెడ్డి, జి. రమేష్, ప్రధాన కార్యదర్శిగా జి. సద్గుణ చారి, సంయుక్త కార్యదర్శులుగా కె. చంద్ర రెడ్డి, ఎం. శశిధర్ రావు, బి. నరసింహారెడ్డి, కోశాధికారిగా చె. కృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు.ఈకార్యక్రమంలో కాలనీ మాజీ అధ్యక్షుడు గూడూరు సుదర్శన్ రెడ్డి, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు దుడక దశరథ, తల్లాప్రగడ మహేష్, పంజాల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!