చదువు మాత్రమే జీవితానికి గౌరవం తెస్తుంది
డా. జిల్లెల చిన్నారెడ్డి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు
వనపర్తి,అక్టోబర్22(తెలంగాణ ముచ్చట్లు):
పట్టుదల, కష్టపడి చదువుకుంటే జీవితంలో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. జిల్లెల చిన్నారెడ్డి అన్నారు.వనపర్తి మండలం రాజపేట గ్రామానికి చెందిన లక్ష్మయ్య–ఈశ్వరమ్మ దంపతుల కుమారుడు మోహన్‌కుమార్ నీట్ పరీక్షలో 383 మార్కులు సాధించి 6000 రాష్ట్ర ర్యాంక్ తో జయశంకర్ భూపాలపల్లి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు పొందిన సందర్భంగా డా. చిన్నారెడ్డి గారు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా డా. చిన్నారెడ్డి మాట్లాడుతూ..మోహన్‌కుమార్ చిన్నప్పటి నుంచీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకుని, నిరంతర శ్రమతో ఈ స్థాయికి రావడం ఎంతో గర్వకారణం. పేదరికం ఎప్పుడూ అడ్డంకి కాదు. కష్టపడి చదివితే చదువు మాత్రమే జీవితానికి గౌరవం తెస్తుంది. యువత పట్టుదలతో ముందుకు సాగి తమ కుటుంబం, గ్రామం, జిల్లాకు గౌరవం తీసుకురావాలి అని అన్నారు.మోహన్‌కుమార్ మంచి వైద్యుడిగా ఎదిగి వనపర్తి నియోజకవర్గానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి బాబా, జిల్లా ఏఐపిసిసి ఉపాధ్యక్షులు నాగార్జున, జిల్లా ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు రోహిత్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆవుల చంద్రశేఖర్, యూత్ నాయకులు ఇర్ఫాన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంజిరెడ్డి, వాకిటి బాలరాజ్, కోళ్ల వెంకటేష్, జానంపేట నాగరాజు, రామ్‌సింగ్ నాయక్, మన్యం యాదవ్, అబ్దుల్లా, నందిమల్ల రాము, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.


Comments